https://oktelugu.com/

వైసీపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీడీపీ సాధన దీక్ష

తెలుగుదేశం పార్టీ రాష్ర్టవ్యాప్త నిరసనకు దిగుతోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ సాధన దీక్ష పేరుతో నిరసనలు చేపడుతోంది. కరోనా విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైంది. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో చేపట్టిన దీక్షకు అధినేత చంద్రబాబు హాజరవుతున్నారు. రాష్ర్టంలోని175 నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలు దీక్షలను ప్రారంభించారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి దీక్షలను ప్రారంభించారు. కరోనా మహమ్మారి వల్ల సుమారు కోటి […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 29, 2021 8:31 pm
    Follow us on

    TDP Sadhana Deekshaతెలుగుదేశం పార్టీ రాష్ర్టవ్యాప్త నిరసనకు దిగుతోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ సాధన దీక్ష పేరుతో నిరసనలు చేపడుతోంది. కరోనా విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైంది. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో చేపట్టిన దీక్షకు అధినేత చంద్రబాబు హాజరవుతున్నారు. రాష్ర్టంలోని175 నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలు దీక్షలను ప్రారంభించారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి దీక్షలను ప్రారంభించారు.

    కరోనా మహమ్మారి వల్ల సుమారు కోటి మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నిర్మూలనకు వైసీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.కరోనా తీవ్రత కొనసాగినంత కాలం బాధిత కుటుంబాలకు ప్రతి నెల రూ.7500 లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

    కొవిడ్ తో మరణించినవారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరారు. ఆక్సిజన్ లేక మరణిస్తున్న వారి కుటుంబాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. కరోనా కాలంలో మరణించిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందకు ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు. కరోనా కారణంగా దెబ్బతిన్న రైతులను కూడా పట్టించుకోవాలని కోరారు.

    విధి నిర్వహణలో చనిపోయిన వైద్య, పారిశుధ్య, పోలీస్, ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలకు రూ.50 లక్షలు అందించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్ కు రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలన్నారు. జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా గుర్తించి వారికి సైతం బీమా కల్పించాలని కోరారు. వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతంచేయాలని సూచించారు.

    కరోనా విపత్తును తేలిగ్గా తీసుకోవడమే కాకుండా కరోనా విధ్వంస కాలంలో చేతులెత్తేసిన సర్కారు జగన్ హయాంలో వైసీపీ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. కరోనా బాధితులను ఆదుకోవడాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సాధన దీక్ష నిర్వహిస్తుందన్నారు.చంద్రబాబు దీక్షకు మద్దతుగా రాష్ర్ట వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలుఅధిక సంఖ్యలో పాల్గొన్నారు.