
మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్ కు పాలనపై కొంత నియంత్రణ ఉంటే హైదరాబాద్ లో మరో సంఘటన జరగకపోయేదని అన్నారు. కేటీఆర్‌కు పరిపాలనపై కొంత నియంత్రణ ఉంటే, సింగరేణి కాలనీ సంఘటనను మరచిపోకముందే మంగళ్ టోపీలో ఈ రోజు 9 ఏళ్ల చిన్నారిని వేధించే ప్రయత్నం జరగకపోయేదని తెలిపారు. తెలంగాణలో గత ఏడేళ్లలో పోక్సో నేరాలు 300 శాతం పెరిగాయని విమర్శించారు.