
రాష్ట్ర పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ వి. కనగరాజ్ నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ కనగరాజ్ ను అథారిటీ ఛైర్మన్ గా నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కోర్టు సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం జస్టిస్ కనగరాజ్ ను నియమించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఆయన వాదనలతో కోర్టు ఏకీభవించింది.