
తాను కాంగ్రెస్ లోనే ఉంటాననని పార్టీ మారే ఆలోచన లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. తన దృష్టిలో పీసీసీ అధ్యక్ష పదవి చాలా చిన్నదని చెప్పారు. దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ను ముందుకు నడిపే సమర్థమైన నేత లేరు. రేవంత్ చిన్నపిల్లవాడు. ఆయన గురించి నా దగ్గర మాట్లాడొద్దు. రాజకీయాలపై మాట్లాడనని గతంలోనే చెప్పా. నేతలు రాజకీయాలు వదిలేసి అభివృద్ధి పై దృష్టి సారించాలి ప్రజాసమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడతా అని కోమటిరెడ్డి అన్నారు. అంతకు ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఎంపీ కోమటిరెడ్డి వెంటట్ రెడ్డి భేటీ అయ్యారు.