
ఏమిటో.. వైవిధ్యం పేరుతో దిక్కుమాలిన ఐడియాలను సినిమాలుగా తీసేస్తున్నారు సినిమా వాళ్ళు. లేకపోతే, 60 ఏళ్ల మహిళకు పాతికేళ్ల కుర్రాడికి మధ్య పెళ్లి ఏమిటి ? పైగా వారి మధ్య ఎలాంటి బంధం ఉంటుంది ? అంటూ ఆడియన్స్ ను ప్రశ్నించడం ఏమిటి ? దీనికి తోడు ఆ కుర్రాడు, ఆ ముసలావిడకి అసలు ఎలా భర్త అయ్యాడు ? అంటూ మళ్ళీ మరో క్వశ్చన్ మార్క్ ఒకటి.
ఇంతకీ వాళ్లిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకున్నారో ‘సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి’ మేకర్స్ కి అయినా కరెక్ట్ గా తెలుసా ? ఇన్నాళ్లు ముసలాడితో పడుచుపిల్ల టైపు సినిమాలు చాల వచ్చాయి. కాబట్టి, ఇప్పుడు ఇదే పాయింట్ ను రివర్స్ చేసి మొత్తానికి ఇదే మా సినిమా మెయిన్ పాయింట్ అంటూ ఒక సినిమాని తీసుకువస్తున్నారు. ఇక 25 ఏళ్ల వాడిగా పార్వతీశం నటిస్తున్నాడు.
ఎవరు ఈ పార్వతీశం అంటే.. ‘కేరింత’ అనే సినిమాలో కమెడియన్ గా నటించాడు గుర్తుందా ? అతగాడే ఇతను. ఇక 60 ఏళ్ల అతని భార్యగా హాస్యనటి శ్రీలక్ష్మి నటిస్తున్నారు. పాపం శ్రీలక్ష్మి తనకున్న ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఇలాంటి దిక్కుమాలిన సినిమాలు కూడా చేయాల్సి రావడం నిజంగా ఆమె బ్యాడ్ లకే. అసలు ఈ మహత్తర ఐడియాను రాసిన మహానుభావుడు పేరు చైతన్య కొండ.
డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశాడు ఈ చైతన్య కొండ. ఈ ‘సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాతోనే ఇతగాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక కుటుంబం అంతా కలిసి చూడదగ్గ మంచి వినోదాత్మక చిత్రం మాది అని ఇతగాడు గట్టిగా చెబుతున్నా.. పోస్టర్ లో పార్వతీశం పక్కన శ్రీలక్ష్మిగారిని చూస్తేనే ఏవగింపుగా ఉంది. మరి ఈ సినిమా నవ్వులు పూయిస్తుందో లేక నస పెడుతుందో చూడాలి.