విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 14 యూనివర్సిటీల వీసీలు ఆన్ లైన్ సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు పరిశోధనలు, ఆవిష్కరణల కేంద్రాలుగా ఎదగాలి. కరోనా సంక్షోభంపై విశ్వ విద్యాలయాల్లో శాస్త్ర, సామాజిక పరిశోధనలు జరగాలి. అన్ లైన్ విద్యను అందుకోలేని పేదలకు సదుపాయాలు కల్పించాలని అన్నారు. డిజిటల్ విద్య అంతరాలను తగ్గించాలి కానీ, పెంచకూడదు అని గవర్నర్ అన్నారు.