
భారత్ లో వేగంగా వ్యాపిస్తోన్న కరోనా డెల్టా వేరియంట్ అమెరికాకు కూడా వ్యాప్తి చెందుతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంథోని ఫౌచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొందరగా వ్యాక్సిన్ వేయించుకోవాలని దేశ పౌరులను కోరుతున్నారు. ప్రజలారా, డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకర కొవిడ్ స్ట్రెయిన్. యూకేలో ఈ డెల్టా వేరియంట్ 12- 20 ఏళ్ల వయస్కుల్లో వేగంగా వ్యాపిస్తోంది. వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి అని బైడెన్ ట్వీట్ చేశారు.