
కత్తితో ఓ యువకుడు హల్ చల్ చేస్తూ దాడికి యత్నించిన ఘటన గుంటూరు నగరంలో ని అరండల్ పేటలో సోమవారం చోటు చేసుకుంది. అరండల్ పేట నాలుగో లైన్ లో ఓ షాపు వద్దకు కత్తితో వచ్చిన యువకుడు తనని ప్రేమించమంటూ ఓ యువతి వెంటపడ్డాడు. కాబోయే భర్తతో ఇంటి నుంచి వచ్చిన ఆమెపై దుర్భాలషలాడాడు. యువతికి కాబోయే భర్తపై కత్తితో దాడికి యత్నించాడు. అతను చాకచక్యంగా తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. అక్కడే ఉన్న స్థానికులు గమనించి యువకుడిని అడ్డుకోవడంతో అక్కడి నుంచి అతను పరారయ్యాడు. ఆనంతరం యువతి తనకు కాబోయే భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.