
కరోనా పేరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వైద్యాన్ని మరింత అందుబాటులోకి తేవడానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు యుద్ధ ప్రాతిపదికన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందేలా 114 దవాఖానాల్లో సరిపోను సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు144 మంది డాక్టర్లు, 527 మంది నర్సులు, 84 మంది లాబ్ టెక్నీషియన్లు, మొత్తం 755 పోస్టులను సీఎం మంజూరు చేశారు.