
కేంద్ర ప్రభుత్వం నేరుగా వ్యాక్సిన్లు ఎవరికీ ఇవ్వడం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. రాష్టాల కంటే కేంద్రానికి టీకాలు తక్కువ ధరకే లభిస్తున్నాయన్న ఆరోపణలను కొట్టి పారేశారు. భారత ప్రభుత్వం వద్ద ఉన్న 50శాతం కోటా వ్యాక్సిన్లను రాష్ట్రాల ద్వారానే ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అందువల్ల కేంద్రానికి వ్యాక్సిన్లు చౌకగా లభిస్తున్నాయన్న ఆరోపణలు అసంబద్ధమన్నారు.