బిగ్ బాస్ తెలుగు సీజన్ మళ్లీ మొదలు కాబోతోంది. జాతీయ స్థాయిలో అన్ని షోల కంటే కూడా తెలుగు బిగ్ బాస్ అత్యంత ప్రేక్షకాదరణ పొందుతూ దూసుకెళుతోంది. తాజాగా ఐదో సీజన్ కు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు.అయితే హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ నిర్వాహకులకు షాకిచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సీజన్ నుంచి నాగార్జున తప్పుకున్నట్లు సమాచారం. నాగార్జున స్థానంలో ఓ స్టార్ హీరోను హోస్ట్ చేయడానికి నిర్వాహకులు ఒప్పించినట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే నాలుగు సీజన్లు గ్రాండ్ హిట్ అయ్యాయి. తొలి సీజన్ ను ఎన్టీఆర్, రెండో సీజన్ ను నాని, మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యాయి.
తెలుగు బిగ్ బాస్ సీజన్ ఇంత హిట్ అవ్వడానికి హోస్ట్ లే కారణం. ముఖ్యంగా నాగార్జున హోస్ట్ అయ్యాక తెలుగు బిగ్ బాస్ మరింత లెవల్ కు ఎదిగింది. టీఆర్పీ రికార్డులను బద్దలు కొట్టింది. అత్యధిక వ్యూయర్ షిప్ తో రికార్డును సృష్టించింది.
ఐదో సీజన్ కోసం ఇప్పటికే సెట్ నిర్మాణం పూర్తయినట్టు సమాచారం. కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియలు కూడా తుదిదశకు చేరాయని అంటున్నారు.
సెప్టెంబర్ 5 వ తేదీ నుంచి బిగ్ బాస్ తెలుగును మొదలుపెట్టబోతున్నట్టు సమాచారం. అయితే ఈసారి హోస్ట్ నాగార్జున తప్పుకున్నాడని.. ఆయన స్తానంలో హీరో రానా హోస్టింగ్ చేయబోతున్నాడని వార్త బయటకు వచ్చింది. వరుసగా సినిమాలు ఒప్పుకోవడంతోనే నాగార్జున బిగ్ బాస్ కు టైం కేటాయించలేక వదులుకున్నట్లుగా చెబుతున్నారు.