
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కరోనా నుంచి కోలుకున్నారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీ రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం బుధవారం సీఎం కు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా ఫలితం నెగిటివ్ గా నిర్ధారణ అయింది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్ లో ఉన్న సీఎం కు రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా రాపిడ్ టెస్టులో నెగటివ్ గా రిపోర్టు వచ్చింది. కాగా ఆర్టీపీసీఆర్ పరీక్షా ఫలితాలు రేపు రానున్నాయి.