
తెలంగాణలో వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. అర్హులను గుర్తించి వీలైనంత త్వరగా పింఛన్లు అందించాలన్న మంత్రివర్గం ఆదేశాల మేరకు గ్రామీణ, పేదరిక నిర్మూలన సంస్థ కొత్త లబ్ధిదారుల ఎంపిక కసరత్తును ప్రారంభించింది. 57 ఏళ్లు నిండిన వారు ఆసరా పింఛన్ కోసం మీ-సేవ, ఈ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.