
సెంట్రల్ బ్యంక్ ఆర్బీఐ జారీ చేసిన కొన్ని ఆదేశాలను ఉల్లంఘించినందుకు సిటీ యూనియన్ బ్యాంక్, తమిళనాడు మైర్కాంటైల్ బ్యాంక్, మరో రెండు ఇతర బ్యాంకులపై ఆర్ బీఐ భారీ జరిమానా విధించింది. వ్యవసాయం రుణాలు, ఎడ్యుకేషన్ రుణాలు, ఎంఎస్ ఎం ఈ రుణాల విషయంలో ఆర్ బీఐ నిబంధనలను పాటించని కారణంగా సిటి యూనియన్ బ్యాంక్ లిమిటెడ్ కు రూ. 1 కోటి జరిమానా విధించింది. అలాగే సైబర్ సెక్యూరిటీ విషయంలో నిబంధనలు పాటించని కారణంగా తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ పై రూ. 1 కోటి జరిమానా వేసింది. ఆర్బీఐ మరో రెండు బ్యాకులపై కూడా జరిమానా విధించింది. నూతన్ నాగరిక్ సహకారి బ్యాంక్, పూణేలోని డైమ్లెర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పై అపెక్స్ బ్యాంక్ పై రూ. 10 లక్షల జరిమానా వేసింది.