Peddi Release Date : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) ప్రస్తుతం చేస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు సాధారణమైనవి కావు. ఎందుకంటే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి, అదే విధంగా గత ఏడాది నవంబర్ నెలలో ఈ చిత్రం నుండి విడుదలైన ‘చికిరి..చికిరి’ పాటకు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘చికిరి’ పాటకు అయితే యూట్యూబ్ లో అన్ని భాషలకు కలిపి 200 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో కచ్చితంగా ఈ సినిమాలో ఎదో గొప్ప విషయం ఉంది, రామ్ చరణ్ మరోసారి ‘రంగస్థలం’ రేంజ్ బ్లాక్ బస్టర్ ని అందుకోబోతున్నాడు, అది కూడా ఆయన పుట్టినరోజు నాడు, మార్చి 27 న జరగబోతుంది అంటూ అభిమానులు చాలా గర్వంగా చెప్పుకొచ్చారు. కానీ ఈ సినిమా మార్చి 27 న విడుదల అవ్వడం అసాధ్యమని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి, ఇంకా 30 రోజులకు పైగా డేట్స్ అవసరం ఉందట. రామ్ చరణ్ ఈ భారీ షెడ్యూల్ కోసం తన శరీరాన్ని ఎలా మార్చుకున్నాడో ఈరోజు ఉదయం ఆయన తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఫోటోలను చూసి అర్థం చేసుకోవచ్చు. ఈ 30 రోజుల షూటింగ్ ని పూర్తి చేసుకొని , ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి కావాల్సిన సమయం మార్చి 27 న విడుదలకు సరిపోదని, కచ్చితంగా పోస్ట్ ప్రొడక్షన్ కి మూడు నెలల సమయం పడుతుందని, కాబట్టి ఈ చిత్రం వాయిదా పడేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ వాయిదా పడితే, దసరా వరకు అభిమానులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి.
మరో పక్క ఈ చిత్రం నుండి రెండవ పాట విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ పాట రావొచ్చు. అంతే కాకుండా రీసెంట్ గా రామ్ చరణ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో కూడా ‘పెద్ది’ ని మార్చి 27 న విడుదల చేయబోతున్నట్టు చెప్పుకొచ్చాడు. మూవీ టీం విడుదల తేదీ లో ఎలాంటి మార్పు లేదని అంటూనే ఉన్నారు కానీ, పరిస్థితులు చూస్తే అలా అనిపించడం లేదు. ఒకవేళ ఈ సినిమా వాయిదా పడితే, మార్చి 27 న పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం విడుదల అయ్యేందుకు సిద్ధం గా ఉంది. ఓజీ చిత్రం తో సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కినా మెగా ఫ్యామిలి, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సక్సెస్ తో తారా స్థాయికి వెళ్ళింది. ఈ సక్సెస్ జోరుని పెద్ది కొనసాగిస్తుందా?, లేదా ఉస్తాద్ భగత్ సింగ్ కొనసాగిస్తుందా అనేది చూడాలి.
