Chiranjeevi Gift Anil Ravipudi: పటాస్ సినిమాతో దర్శకుడిగా మారి ఆ మూవీతో సూపర్ సక్సెస్ ను సాధించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి… ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ అయితే ఉంటుంది. దాని చుట్టూనే కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. అందువల్లే ఆయన సినిమాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రతి క్యారెక్టర్ ని చాలా ఫన్నీగా రాసుకుంటాడు.అందువల్లే అతను ఈజీగా సక్సెస్ అవగలుగుతున్నాడు. ఇప్పటివరకు 9 సినిమాలు చేస్తే 9 సినిమాలను కూడా సూపర్ సక్సెస్ గా నిలిపిన ఘనత అతనికి దక్కింది.
చిరంజీవి తో చేసిన మన శంకర్ వర ప్రసాద్ సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. సంక్రాంతి హిట్టుగా నిలిచిన ఈ సినిమాతో అనిల్ రావిపూడి మరోసారి తన డైరెక్షన్లో ఉన్న పొటెన్షియల్ కి ఏంటో ప్రేక్షకులందరికి తెలియజేశాడు… యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఏలే క్రమంలో మన దర్శకులందరు బాలీవుడ్ డైరెక్టర్లను బీట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు మాత్రం కేవలం తెలుగులోనే సక్సెస్ఫుల్ సినిమాలను చేసుకుంటూ సీనియర్ హీరోలు అందరికి వరుస సక్సెస్ లను సాధించి పెడుతున్నాడు…ఈ సంక్రాంతికి చిరంజీవికి భారీ సక్సెస్ ని అందించినందుకు గాను మెగాస్టార్ చిరంజీవి ఒక ఖరీదైన వాచ్ ను అనిల్ రావిపూడికి గిఫ్టుగా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఆ వాచ్ విలువ కోట్లలోనే ఉంటుందట. ఏది ఏమైనా కూడా మెగాస్టార్ చిరంజీవి ఫ్లాపుల్లో ఉన్నాడు. అనిల్ సినిమాతో అతను మరోసారి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అందుకే చిరంజీవి తన మీద ఇష్టాన్ని తెలుపుతూ వాచ్ గిఫ్ట్ ఇచ్చాడు…
ఇక చిరంజీవికి భారీ హిట్ ఇచ్చిన ఘనత కూడా అనిల్ రావిపూడికే దక్కుతుంది. చిరంజీవి సైతం ఈ మూవీ లో వింటేజ్ లుక్స్ తో ప్రేక్షకులందరిని మెప్పించాడు. ఇక డ్యాన్స్ లు, ఫైట్లతో ప్రతి ఒక్కరిని అలరించాడు. తనకి పర్ఫెక్ట్ సినిమా పడితే ఎలా ఉంటుందో చిరంజీవి మరోసారి ప్రూవ్ చేశాడు. ప్రస్తుతం చిరంజీవిని ట్రోల్ చేసే వాళ్ళు సైతం ఈ సినిమాని చూసి చిరంజీవి స్టామినా ఏంటో మరోసారి చాలా గొప్పగా చెబుతుండడం విశేషం…
