Ravi Teja : వరుసగా కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన రవితేజ ఇప్పుడు తన పంథా ను మార్చాడు. మాస్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్లను చేయడంలో బిజీ అయిపోయాడు. రీసెంట్ గా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాతో మంచి సక్సెస్ ని సాధించిన ఆయన ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఇలాంటి వైఖరినే పాటిస్తూ జానర్స్ షిఫ్ట్ చేస్తూ సినిమాలను చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక దానివల్ల అతని యాక్టింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇక దాంతో పాటుగా ప్రేక్షకులు తనను మూస ధోరణిలో చూసిన ఫీలింగ్ అయితే కలగకుండా ఉంటుంది.
కాబట్టి రవితేజ ఇప్పటినుంచి కొత్తగా ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గత సంవత్సరం వచ్చిన ‘మాస్ జాతర’ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించకపోవడంతో పూర్తిగా వెనకబడిపోయిన ఆయన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో కొంత వరకు కోలుకున్నాడనే చెప్పాలి.
నిజానికి రవితేజ లో వచ్చిన మార్పు చాలా మంచిదనే చెప్పాలి. డిఫెరెంట్ సినిమాలను చేసినప్పుడే ఒక హీరోకు ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఏర్పడతారు. అలాగే వివిధ పాత్రలను పోషించడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కో పాత్రలో యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించుకోవడానికి అవకాశం దొరుకుతుంది… అందుకే మధ్య మధ్యలో కొత్త తరహా సినిమాలను ట్రై చేస్తే బాగుంటుందని రవితేజ అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక ఈ విధంగా రవితేజ ఫ్యూచర్లో కూడా ట్రై చేస్తూ ముందుకు సాగుతాడా? ఒకవేళ ఆయన ఇలాగే ముందుకు వెళ్తే మాత్రం ఆయనకు మరో 10 సంవత్సరాల పాటు తన కెరియర్ సాఫీగా సాగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక రవితేజ నుంచి వచ్చే సినిమాలను ఒక వర్గం ప్రేక్షకులు చూడటం మానేశారు. కాబట్టి ఇప్పటికైనా ఆయన మారి మంచి సినిమాలు చేస్తే మంచిది…తన అభిమానులు సైతం ఆయన నుంచి కొత్తదనాన్ని కోరుకుంటున్నారు..
