Ram Charan apology : తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ పాపులారిటిని సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్…’త్రిబుల్ ఆర్’ సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన ఈ హీరో ప్రస్తుతం పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా భూపాల్ లో నిర్వహించిన ఈవెంట్ లో రామ్ చరణ్ పాల్గొనడమే కాకుండా తన అభిమానులను సైతం కలుసుకున్నాడు. అలాగే ఈవెంట్ కి చాలామంది ప్రేక్షకులు వచ్చి ఈవెంట్ ని సక్సెస్ ఫుల్ గా నిలిపారు. ఇక ఈ ఈవెంట్ లో యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూనే ఇండియన్ క్రికెట్ ప్లేయర్ అయిన బుమ్రా ను ఫుట్ బాల్ ప్లేయర్ అంటూ మాట్లాడాడు. ఇక రామ్ చరణ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత తన తప్పును తెలుసుకొని బుమ్రా చాలా మంచి బౌలర్ నాకు పేర్లు సరిగ్గా గుర్తులేక తను ఫుట్ బాల్ ప్లేయర్ అని చెప్పను అనే అర్థం వచ్చేలా ఒక ట్వీట్ చేశాడు. అది చూసిన ప్రతి ఒక్కరు రామ్ చరణ్ వ్యక్తిత్వం చాలా గొప్పదని చెప్పుకుంటున్నారు.
కొంతమంది హీరోలు వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు దానిని సమర్ధించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం తను చేసిన మిస్టేక్ ఏంటో తెలుసుకొని సారీ చెప్పడం అనేది నిజంగా ఆయన గొప్పతనానికి నిదర్శనం అనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు హీరోలు ఎవరూ కూడా ఇలాంటి ఒక మిస్టేక్ జరిగితే తొందరగా రెస్పాండ్ అయి సారీ చెప్పడం అనేది ఈ మధ్యకాలంలో జరగలేదు.
కానీ రామ్ చరణ్ మాత్రం ఈవెంట్ ముగిసిన వెంటనే రియాక్ట్ అవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. అలా చెప్పాలంటే చాలా మెచ్యూరిటీ ఉండాలి మనం స్టార్స్ అనే గర్వం ఉండకూడదు… రామ్ చరణ్ డౌన్ టు ఎర్త్ ఉంటాడు కాబట్టే ఆయనను చాలా మంది ఇష్టపడుతుంటారు. రామ్ చరణ్ చేస్తున్న ‘పెద్ది’ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది.
ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక బుచ్చిబాబు సైతం ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలుపడానికి చాలా కసరత్తులైతే చేశాడు. ఇక ఈ సినిమా ఫైనల్ అవుట్ పుట్ ఎలా ఉంటుందనేది తెలియాలంటే మాత్రం జూన్ 4వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…
Uff… I’m genuinely so forgetful with names sometimes.
Apologies to @Jaspritbumrah93 Ji for the mix-up – it was a genuine human error in the middle of all the excitement and the crowd
I truly respect you and I am a huge fan of your game. You make every Indian feel proud when…
— Ram Charan (@AlwaysRamCharan) May 23, 2026
