
మరో మూడు రోజుల్లో తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అప్పపీడన ప్రభావంతో రాగల ఐదు రోజుల్లో తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.