
తమ సంస్థ నాన్ ఎగ్జ్సిక్యూటివ్ డైరెక్టర్/ ఛైర్మన్ పదవి నుంచి రాహుల్ బజాజ్ వైదొలగబోతున్నట్లు ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో ప్రకటించింది. శుక్రవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. రాజీనామా చేసిన తరువాత ఐదేళ్లపాటు కంపెనీ చైర్మన్ ఎమెరిటస్ గా ఉండనున్నట్లు ఆయన ప్రకటించారు. నీరజ్ బజాజ్ సంస్త నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.