
నిరంజనీ అఖాడా మనీష్ భారతికి చెందిన శ్రీ మహంత్ (49) కన్నుమూశారు. కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన రిషికేశ్ లోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతుండా పరిస్థితి విషమించి గురువారం తుదిశ్వాస విడిచారు. అలాగే అదే అఖాడాకు చెందిన లఖన్ గిరి సైతం వైరస్ బారిన పడి కన్నుమూశారు. దీంతో ఇప్పటి వరకు ఆరుగురు సాధువులు కుంభమేళాకు హాజరైన ఆనంతరం కరోనా బారినపడి ప్రాణాలు విడిచారు.