
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఆక్సిజన్ సిలిండర్ పేలింది. దీంతో ఒకరు మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం కాన్పుర్ లోని దాదా నగర్ పారిశ్రామిక ఉన్న పన్కీ ఆక్సిజన్ ఫ్లాంట్ లోని సిలిండర్ లో ప్రాణవాయువును నింపుతున్నారు. ఈ క్రమంలో అది ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఓ వ్యక్తి, ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకున్నారు.