
ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ మూడు రోజులుగా సీఎం జగన్ కు లేఖలు రాస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ కూడా లేఖ రాశారు. ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విడుదల హామీ నెరవేరలేదని ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీ క్యాలెండ్ ఉంటుందని ఎన్నికల మేనిఫెస్టోలో వైకాపా హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ హామీతో ఎన్నికల సమయంలో నిరుద్యోగుల నుంచి మద్దతు లభించిందన్నారు. ఉగాదికి నోటిఫికేషన్ వస్తుందన్న ఆశతో నిరుద్యోగులు ఎదురు చూశారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం వెంటనే ఉద్యోగాల భర్తీకి వార్షిక క్యాలెండర్ ప్రకటించాలని ఎంపీ లేఖలో కోరారు.