
కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు దేశవ్యాప్తంగా సినీ రంగం షట్టర్ క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త కుదుటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో.. అతి త్వరలో కెమెరా ఆన్ కాబోతోంది. అయితే.. ప్రభాస్ విషయానికి వచ్చినప్పుడు మూడు చిత్రాలు లైన్లో ఉన్నాయి. ఇందులో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న రాధేశ్యామ్ ఒకటి కాగా.. మిగిలిన రెండు సెట్స్ పై ఉన్న సలార్, ఆదిపురుష్.
ఇందులో ఏ సెట్లో ప్రభాస్ ముందుగా అడుగు పెట్టబోతున్నాడు అన్నప్పుడు.. చాలా మంది సలార్, ఆదిపురుష్ లలో ఒక పేరు చెబుతారు. కానీ.. రెబల్ స్టార్ రాధేశ్యామ్ సెట్లో కాలు మోపనున్నాడు! అదేంటీ..? ఆ సినిమా కంప్లీట్ అయిపోయిందిగా అంటారేమో.. వాస్తవానికి సినిమా కంప్లీట్ అయ్యింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫినిష్ అయ్యింది. కానీ.. కొన్ని సీన్లు రీషూట్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఇందుకోసం 10 రోజుల చిన్న షెడ్యూల్ ను ప్లాన్ చేశారట.
ఇప్పటికే.. హైదరాబాద్ లో సెట్ కూడా సిద్ధమైపోయిందని తెలుస్తోంది. షూటింగ్ ప్రారంభం కావడమే ఆలస్యం.. ప్రభాస్ జాయిన్ అయిపోతాడు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత సలార్ టీమ్ తో ప్రభాస్ చేరిపోతాడని తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన షెడ్యూల్ ను కంప్లీట్ చేసిన తర్వాత ఆదిపురుష్ టీమ్ తో కలుస్తాడని సమాచారం.
అయితే.. ప్రభాస్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా.. షూట్ కోసం ప్లానింగ్ మొదలు పెట్టిందట యూనిట్. ఇప్పటికే.. మహారాష్ట్ర సర్కారు షూటింగులకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో.. త్వరగా పట్టాలెక్కించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ షెడ్యూల్ లో సైఫ్ అలీఖాన్ పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత ప్రభాస్ తో మరో షెడ్యూల్ ప్లాన్ చేయబోతున్నారట.