
ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ బీబీ రాణి మౌర్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు మరి కొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పుష్కర్ ఎంపికపై సీనియర్లు అసంతృప్తితో ఉన్నారని అందుకే పుష్కర్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారన్న ప్రచారం జరిగింది కానీ మరో నలుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.