రామానాయుడు వైజాగ్ లో కొండ పై మంచి స్టూడియో ఒకటి కట్టారు. అయితే వైజాగ్ లోని ఈ స్టూడియోను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునేందుకు ప్రయత్నిస్తోందనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇక పై వైజాగ్ నుంచే పాలించాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే విశాఖపట్నం నగరాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా కూడా ప్రకటించారు.
అందుకే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నుండే పరిపాలన సాగించేందుకు కసరత్తులు మొదలు పెట్టారు. కానీ, వైజాగ్ లో అనుకూలమైన భవంతులు లేవు అనేది ఓపెన్ సీక్రెట్. అలాగే బారీగా ప్రభుత్వ స్థలాలు కూడా లేవు. దాంతో, మంచి లొకేషన్ లో ఉన్న రామానాయుడు స్టూడియో పై పడింది ప్రభుత్వం కళ్ళు. ఎలాగైనా స్టూడియో స్థలాన్ని తీసుకోవాలని జగన్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందట.
అయితే మీడియాలో ఈ వార్తలు రావడం తప్ప, ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇంతవరకు రాలేదు. ఒకవేళ ఈ వార్త నిజం అయితే ఏమిటి పరిస్థితి ? సురేష్ ప్రొడక్షన్స్ లో పని చేస్తోన్న ఓ వ్యక్తి ముందు ఇదే ప్రశ్న ఉంచితే.. జగన్ ప్రభుత్వం నుండి ఈ ప్రతిపాదన గతేడాదే వచ్చిందని.. అప్పుడే మేము ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తిరస్కరించారని సురేష్ ప్రొడక్షన్ లోని ముఖ్యడు ఒకరు చెప్పుకొచ్చారు.
కానీ ప్రభుత్వం నుంచి అలాంటి ప్రపోజల్ ఏమి రాలేదని సురేష్ బాబు ఇప్పటికీ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సురేష్ బాబు నో చెప్పినా, ఇంకేం చేసినా ప్రభుత్వం కావాలనుకుంటే తీసుకోగలదు, సురేష్ బాబుకు అడ్డుకునే అవకాశమే ఉండకపోవచ్చు. నిజానికి ఈ స్థలాన్ని అప్పట్లో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డినే ఇచ్చారు.