
రాష్ట్రవ్యాప్త నర్సింగ్ విద్యార్థులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. మొదటి సంవత్సరం 1500 గా ఉన్న స్టైఫండ్ ను 5 వేలకు, రెండో సంవత్సరం 1700గా ఉన్న స్టైఫండ్ ను 6 వేలకు, మూడో ఏడాది 1900 గా ఉన్న స్టైఫండ్ ను 7 వేలకు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, నర్సులు, డాక్టర్లు, ల్యాబ్ టెక్నిషియన్లు, పారా మెడికల్ సిబ్బందికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు.