
అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ను హైదరాబాద్ కు చెందిన మరో ఫార్మా సంస్థ ఉత్పత్తి చేయనుంది. బయోలాజికల్ ఈ సంస్థ తన సొంత వ్యాక్సిన్ తో పాటు జే అండ్ జే వ్యాక్సిన్ ను సైతం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య త్వరలోనే ఒప్పందం కుదరనుండగా ఈ విషయాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ ధ్రువీకరించింది. కొవిడ్ వ్యాక్సిన్ పై బయోలాజికల్ ఈ సంస్థతో కలిసి పని చేయనున్నట్లు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.