
భారత్ బయోటెక్ గుజరాత్ లోని అంక్లేశ్వర్ లో ఉన్న తన యూనిట్ లో కొవాగ్జిన్ ఉత్పత్తిని ప్రారంభించింది. పంపిణీకి సిద్ధంగా ఉన్న తొలి బ్యాచ్ టీకాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ఆదివారం విడుదల చేయనున్నారు. అంక్లేశ్వర్ పర్యటనలో భాగంగా భారత్ బయోటెక్ యూనిట్ ను ఆయన సందర్శస్తారు. వ్యాక్సిన్ తయారీ నిమిత్తం అంక్లేశ్వర్ లోని యూనిట్ కు ఈనెల 10న కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.