ప్రివిలేజ్ కమిటీ భేటీ ముగిసింది. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్న, నిమ్మలపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. సభను తప్పు దోవ పట్టించారన్న శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదుపై అచ్చెన్న, నిమ్మలపై చర్యలకు సభకు సిఫార్సు చేయనున్న ప్రివిలేజ్ కమిటీ. మద్యం షాపుల విషయంలో అచ్చెన్న, వృద్ధాప్య పెన్షన్ల విషయంలో నిమ్మల సభను తప్పు దోవ పట్టించారని నిర్దారిచిన ప్రివిలేజ్ కమిటీ. స్పీకరును దూషించారనే ఫిర్యాదులో అచ్చెన్నాయుడు క్షమాపణలను పరిగణనలోకి తీసుకుని క్షమించిన ప్రివిలేజ్ కమిటీ. కాకాని గోవర్దన్ రెడ్డి, ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్. అచ్చెన్న, నిమ్మల సభను తప్పు దోవ పట్టించారని ప్రివిలేజ్ కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చింది.
వచ్చే అసెంబ్లీ సమావేశంలో అచ్చెన్న, నిమ్మలపై చర్యలు తీసుకోవాలంటూ నివేదిక ఇస్తాం. నోటీసులు తీసుకునే సమయంలో తాను అందుబాటులో లేనని కూన రవి చెబుతున్నారు.. అందుబాటులోనే ఉన్నారని ఫిర్యాదు దారు చెబుతున్నారు. ఆధారాలు సమర్పించమని ఇద్దరికీ చెప్పాం. ప్రివిలేజ్ కమిటీ ముందుకొచిృన ఆధారాల పరిశీలన అనంతరం కూన రవిపై చర్యల విషయంలో నిర్ణయం తీసుకుంటాం.
మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ తనపై వచ్చి ఫిర్యాదు విషయంలో మరింత సమాచారాన్ని కోరారు.. పంపాలని ఆదేశించాం. కోర్టు పరిధిలో ఉన్నంత మాత్రాన ప్రివిలేజ్ కమిటీలో చర్చించకూడదనేం లేదు. నిమ్మగడ్డకు ఈ వ్యవస్థపై అవగాహన ఉండకపోయిండొచ్చు. ఇకపై అసెంబ్లీలో అచ్చెన్న, నిమ్మలకు మైక్ ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని సభకు సిఫార్సు చేయనున్న ప్రివిలేజ్ కమిటీ. ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు వర ప్రసాద్ ప్రతిపాదనను బలపరిచిన మిగిలిన సభ్యులు. టీడీపీ సభ్యుడు అనగాని వ్యతిరేకించారు.