Crime News: కట్టుకున్న భార్యే ఖతం చేసింది. భర్తను ముక్కలుముక్కలుగా చేసింది. ప్రియుడితో కలిసి తన సరదాలు తీర్చుకునే క్రమంలో భర్తను కడతేర్చింది. నూరేళ్లు కలిసి ఉండాల్సిన ధర్మపత్ని ధర్మం తప్పి ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తోంది. కలిసి జీవిస్తానని పెళ్లినాడు చేసిన ప్రమాణాలను తోసిపుచ్చింది. తన సుఖమే లక్ష్యంగా భర్తను కానరాని లోకాలకు పంపించింది. సంచలనం సృష్టించిన ఈ సంఘటన బీహార్ రాష్ర్టంలో చోటుచేసుకుంది.
ముజఫర్ పూర్ లోని సికందర్ పూర్ నగర్ ప్రాంతానికి చెందిన రాధ అనే వివాహిత ప్రియుడు సుభాష్, సోదరి రాధలతో కలిసి కట్టుకున్న భర్తనే చంపింది. తరువాత ఆయన మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా కోసం కెమికల్ లో వేసి కరిగించేందుకు ప్రయత్నించింది. కానీ కెమికల్ వాడకంతో పేలుడు సంభవించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించేందుకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఖంగుతిన్నారు.
పోలీసులు అక్కడికి చేరుకునే సరికి ముక్కలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. మృతుడు రాకేశ్ మద్యం అక్రమ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు ఇంటికి రాకపోవడంతో సుభాష్ అతడి బార్యను చూసుకునేవాడు. ఈ సందర్భంలో ఇద్దరి అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో వారు రాకేశ్ ను అంతమొందించాలని పథకం పన్నారు.
ఈ నేపథ్యంలో తీజ్ ఉత్సవాల సందర్భంగా భర్త రాకేశ్ ను ఇంటికి పిలిపించిన భార్య ప్రియుడు చెల్లెలు సహాయంతో రాకేశ్ ను చంపేశారు. మృతుడి సోదరుడు దినేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భార్య హంతకురాలు భర్తను హత్య చేసి ఫ్రిజ్ లో దాచిన భార్య వారి సాయంతో అతడిని ముక్కలుముక్కలుగా కోసం పేల్చే సందర్భంలో దొరికిపోయింది.