కేంద్ర ప్రభుత్వం పాలసీ నిర్మాణంలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా వచ్చే నెలలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ ను సందర్శించి కార్మిక సంఘాలతో సమావేశం కానున్నట్టు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు.
ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన సమయం ఆసన్నమైందనీ, తెలుగు ప్రజల ఆత్మాభిమానం దెబ్బతినకుండా మన ప్రాంతానికి నష్టం కలిగించకుండా ప్రతి ఒక్కరూ సమష్టిగా పోరాటం చేయాలని కోరారు. ఈ ప్రాంతానికి మేలు చేయాలన్న కోరిక శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బలంగా ఉందన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా మంగళవారంలో విశాఖపట్నంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ.. “విశాఖ ప్రాంతం ప్రజలు ఎప్పటినుంచో ఘనంగా చెప్పుకునే అంశం విశాఖ స్టీల్ ప్లాంట్. గతంలో 32 మంది బలిదానాలతో మొదలైన ఉద్యమం ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని మనమంతా గర్వపడే స్థాయిలో ఆ రోజు ఈ ప్రాంతంలో వేల మందికి ఉపాధి కల్పిస్తోంది.
ఇది మన చరిత్రతో ముడిపడిన అంశంగా మారిపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని మాత్రం దయచేసి ఇతర ప్రభుత్వ రంగ సంస్థలతో ముడిపెట్టవద్దు. ఇక్కడ చరిత్ర, ప్రజల త్యాగం, తెలుగు వారి ఆత్మాభిమానం అనే అంశాలు ముడిపడి ఉన్నాయన్న అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా ఫిబ్రవరిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రకటించారు. ఆ వెంటనే ఫిబ్రవరి 8, 9, 10 తేదీల్లో ఢిల్లీలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటించి కేంద్ర అగ్ర నాయకత్వాన్ని కలిశారు. ప్రతి సమావేశంలో బలంగా ఒకటే స్టాండ్ తీసుకుని మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకోవద్దు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. ఇది పార్టీలకు సంబంధించిన అంశం కాదు. ప్రజలకు సంబంధించిన విషయం అని బలంగా చెప్పారు.