scrappage policy: వాహనాల తుక్కు పాలసీని ప్రారంభించిన మోదీ

వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడెర్నైజేషన్ ప్రోగ్రామ్ లేదా వాహనాల తుక్కు పాలసీ ని శుక్రవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. గుజరాత్ లో జరిగిన పెట్టుబడిదారులు సదస్సులో వర్చువల్ గా పాల్గొన్న మోదీ.. ఈ కొత్త విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ తుక్కు పాలసీ రూ. 10 వేల కోట్ల పెట్టుబడులను తీసుకురానున్నట్లు ఈ సందర్భంగా మోదీ చెప్పారు. గుజరాత్ లోని అలంగా ఈ వాహనాల తుక్కును హబ్ గా మారగలదని అన్నారు. ప్రస్తుతం ఉన్న తుక్కు పద్దతి […]

Written By: Suresh, Updated On : August 13, 2021 1:52 pm
Follow us on

వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడెర్నైజేషన్ ప్రోగ్రామ్ లేదా వాహనాల తుక్కు పాలసీ ని శుక్రవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. గుజరాత్ లో జరిగిన పెట్టుబడిదారులు సదస్సులో వర్చువల్ గా పాల్గొన్న మోదీ.. ఈ కొత్త విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ తుక్కు పాలసీ రూ. 10 వేల కోట్ల పెట్టుబడులను తీసుకురానున్నట్లు ఈ సందర్భంగా మోదీ చెప్పారు. గుజరాత్ లోని అలంగా ఈ వాహనాల తుక్కును హబ్ గా మారగలదని అన్నారు. ప్రస్తుతం ఉన్న తుక్కు పద్దతి అంత ప్రయోజనకరంగా లేదని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యక్షంగా హాజరయ్యారు.