https://oktelugu.com/

Thammannah: సమంత దారిలోనే తమన్నా కూడా !

తమన్నా కెరీర్ చివరి దశలో ఉంది. అందుకే గ్యాప్ లేకుండా సినిమాలు చేయడానికి బాగా ఆరాటపడుతుంది. కానీ ఈ మధ్య తమన్నాకి చెప్పుకోతగ్గ సినిమాలు ఏవి రాలేదు. ఎలాగూ ఛాన్స్ లు రావడం లేదు కాబట్టి.. రూట్ మార్చింది. ఈ మధ్య తమన్నా ఎక్కువగా తెగ ఫ్యాషన్ షూట్ లు చేస్తోంది. నిత్యం ఏదో ఒక ఫోటో షూట్ చేస్తూ ఆ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ బాగా హడావుడి చేస్తూ ఉంది. […]

Written By: , Updated On : August 13, 2021 / 01:43 PM IST
Follow us on

Thamannah Bhatia

తమన్నా కెరీర్ చివరి దశలో ఉంది. అందుకే గ్యాప్ లేకుండా సినిమాలు చేయడానికి బాగా ఆరాటపడుతుంది. కానీ ఈ మధ్య తమన్నాకి చెప్పుకోతగ్గ సినిమాలు ఏవి రాలేదు. ఎలాగూ ఛాన్స్ లు రావడం లేదు కాబట్టి.. రూట్ మార్చింది. ఈ మధ్య తమన్నా ఎక్కువగా తెగ ఫ్యాషన్ షూట్ లు చేస్తోంది. నిత్యం ఏదో ఒక ఫోటో షూట్ చేస్తూ ఆ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ బాగా హడావుడి చేస్తూ ఉంది.

నిజానికి తమన్నా గతంలో ఎన్నడూ ఇలాంటి వ్యవహారాలు చేయడానికి ఇష్టపడలేదు. సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటూ వచ్చింది ఐతే ఈ మధ్య ఇలా సడెన్ గా తమన్నా ఫోటో షూట్ల మీద పడటానికి కారణమేంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, తమన్నా ఫోటో షూట్స్ చేయడానికి కారణం..క్రేజ్ కోసమే.

సమంత (Samantha) కూడా ఇలాగే సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టి.. పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకోవడంతో పాటు బాలీవుడ్ అవకాశాలను కూడా అందుకుంది. సమంతకి ఇన్ స్టాగ్రామ్ లో ఉన్న ఫాలోయింగ్ చూసే.. ఆమెకు “ది ఫ్యామిలీ మేన్ 2” వెబ్ సిరీస్ లో కీలక పాత్ర ఇచ్చారు. మొత్తానికి సమంత పాపులారిటీ మరింత పెరిగింది.

ఇప్పుడు సమంత దారిలోనే తమన్నా (Tamannaah) కూడా వెళ్తోంది. ఎలాగూ తమన్నా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే కాబట్టి, ఆమెకు మంచి క్రేజ్ పెరిగితే.. ఛాన్స్ లు పెరిగే అవకాశం ఉంది. తమన్నా ఫోటో షూట్లతో హీట్ పెంచే ప్రోగ్రాం పెట్టుకుంది. అన్నట్టు మరో రెండేళ్లల్లో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉంది తమన్నా.