
ఐరాస భద్రతా మండలిలో భారత్ కు ఆగస్టు నెల అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు అధ్యక్ష బాధ్యతలను భారత ప్రతినిధి తిరుమూర్తి స్వీకరించారు. జూలై నెలలో అధ్యక్ష బాధ్యతలను నిర్వహించిన ఫ్రాన్స్ నుంచి భారత్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. ఐరాస భద్రతా మండలిలో నెలకొక దేశం అధ్యక్ష బాధ్యతల నిర్వహణ చేపడుతుంది. శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాలు అధ్యక్ష బాధ్యతలను చేపడుతున్నాయి. 2021-22 కు తాత్కాలిక సభ్య దేశంగా భారత్ ఎన్నికైంది. వచ్చే ఏడాది డిసెంబర్ లోనూ భారత్ మరోమారు అధ్యక్ష బాధ్యతలను చేపట్టనుంది.