Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్థిక, సాంకేతిక అభివృద్ధిలో కొత్త రాష్ట్రం దూసుకుపోతోందని ముర్ము అన్నారు. జాతీయ పురోగతికి చేస్తున్న అవిరాళమైన కృషికి ఈ రాష్ట్రం ప్రసిద్ధి చెందిందని మోదీ తెలుగులో రాసుకొచ్చారు. రాష్ట్ర ప్రజలకు విజయాలు, సంపదలు కలిగేలా ఆశ్వీర్వాదాలు లభించాలని ఆకాంక్షించారు.