NTR – Ram Charan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే నందమూరి – మెగా ఫ్యామిలీల మధ్య తీవ్రమైన పోటీ అయితే నడుస్తూ ఉంటుంది. చిరంజీవి – బాలయ్య బాబుల మధ్య అప్పట్లో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికి ఎప్పటికప్పుడు వీళ్లిద్దరూ వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూ వచ్చారు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ మధ్య కూడా తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. వీళ్లిద్దరూ కలిసి త్రిబుల్ ఆర్ (RRR) సినిమాలో నటించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఎవరికి వారు ఆ సినిమాలో చాలా గొప్ప పెర్ఫార్మన్స్ ని ఇచ్చి చాలా వరకు సక్సెస్ ని సాధించే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నాప్పటికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి చాలా ప్రత్యేకమైన స్థానం అయితే ఉందనే చెప్పాలి. వీళ్ళ సినిమాలు వస్తున్నాయి అంటే వాళ్ళ అభిమానులతో పాటు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ల సినిమాలతో మ్యాజిక్ ను చేసి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను వాళ్ళ వైపు తిప్పుకోవడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు.
ఇక వీళ్లిద్దరూ ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా ఎదిగారు. కాబట్టి ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనే దాని మీదనే తీవ్రమైన పోటీ అయితే ఉంది. ఇక కొన్ని విషయాల్లో జూనియర్ ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ చాలా బెటర్ అంటూ చాలామంది సినిమా ప్రముఖులు సైతం చెబుతున్నారు.
Also Read : రామ్ చరణ్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో మల్టీస్టారర్..డైరెక్టర్ ఎవరంటే!
కెరియర్ మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ చాలా అనవసరమైన స్క్రిప్ట్ లను సెలెక్ట్ చేసుకున్నాడు అంటూ చెబుతున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం చాలా మంచి స్క్రిప్ట్ లను సెలెక్ట్ చేసుకుంటూ వచ్చాడు అంటూ మరి కొంతమంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కెరియర్ మొదట్లో నరసింహుడు, నా అల్లుడు లాంటి డిజాస్టర్ సినిమాలను చేసి తీవ్రమైన బ్యాడ్ నేమ్ అయితే మూట గట్టుకున్నాడు.
కానీ రామ్ చరణ్ మాత్రం అలాంటి సినిమాలకు తావివ్వలేదు. ఆయన ఏ సినిమా చేసిన కూడా అది మినిమం గ్యారెంటీ సినిమాగా ఆడుతూ వచ్చాయి. కాబట్టి కెరియర్ మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకున్నారని చాలామంది సినిమా ప్రముఖులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…