
ఒలింపిక్స్ రెండో రోజే సిల్వర్ మెడల్ తో ఇండియాకు తొలి పతకాన్ని అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చానుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, ఢిల్లీ,తమిళనాడు, అస్సాం, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర క్రీడా ప్రముఖులు ట్విట్టర్లో ఆమెను ప్రశంసించారు. ఇండియాను సగర్వంగా తలెత్తుకునేలా చేశావంటూ ఆకాశానికెత్తారు. 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్ లిఫ్టింగ్ లో ఇండియాకు మెడల్ సాధించిపెట్టిన అథ్లెట్ గా మీరాబాయ్ నిలిచిన విషయం తెలిసిందే.