Spirit Movie Glimpse : ఒకప్పుడు ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలు ఇండస్ట్రీలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు సాగారు. ఇక వాళ్లకు సపోర్టుగా కృష్ణంరాజు సైతం హీరోగా రాణించి మాస్ ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. కృష్ణంరాజు తర్వాత తన వారసుడిగా ప్రభాస్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను అలరించిన ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ప్రభాస్ ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నింటిలో తను వైవిధ్యాన్ని చూపిస్తూ వచ్చాడు. ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ సినిమా మొదటి రెండు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకుంది.
ఈ సంవత్సరం చివర్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో సందీప్ రెడ్డి వంగ ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. అందులో ప్రభాస్ చాలా వైల్డ్ గా కనిపించాడు. ప్రభాస్ ఈ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకోబోతున్నాడనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారమైతే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయాలని సందీప్ రెడ్డి వంగ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గానే సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కాబట్టి వచ్చే నెలలో మహా శివరాత్రి కానుకగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తను ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.
ప్రభాస్ భారీ రేంజ్ లో తనను తాను ఎలివేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులపాటు వెయిట్ చేయాల్సిందే. సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు చేసిన ప్రతి సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నాడు…కాబట్టి స్పిరిట్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ పక్కా అంటూ సందీప్ మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు…