Mana Shankara Vara Prasad : మెగాస్టార్ అనే బిరుదుకి న్యాయం చేయడానికి చిరంజీవి తన సాయ శక్తుల ప్రయత్నం చేస్తున్నాడు. 70 సంవత్సరాల వయసులో కూడా తను ఏ మాత్రం రిలాక్స్ అవ్వడం లేదు. ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటే ఆ సినిమా కోసం ప్రాణం పెట్టేస్తాడు… అలాంటి చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది… ఇప్పటికే ఈ సినిమా మీద భారీ హైప్ అయితే క్రియేట్ అయింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కి సైతం పాజిటివ్ టాక్ రావడంతో సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఇలాంటి సందర్భంలో ఈ సినిమాతో చిరంజీవి అటు కామెడీ, ఇటు యాక్షన్ రెండింటిలోనూ తన సత్తా చాటుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడంలో మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ అవుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఈ సినిమాలో కొన్ని సీక్వెన్స్ లైతే హైలైట్ గా నిలవబోతున్నాయట.
ముఖ్యంగా ఫ్యామిలీ ఎపిసోడ్స్ లో వచ్చే కామెడీ అద్భుతంగా ఉండబోతుందని చిరంజీవి సైతం కామెడీని ఇరగ్గొట్టాడు అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పడం విశేషం. ఇక చిరంజీవి, వెంకటేష్ ఇద్దరు కలిసి చేసే ఫన్ అద్భుతంగా ఉండబోతుందట… ఇంటర్వెల్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అవుతుందని చెబుతుండడం విశేషం…
ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేస్తాయట. మొత్తానికైతే ఈ సినిమాలో ఒక మోరల్ మెసేజ్ కూడా ఉందని అనిల్ రావిపూడి చెబుతుండటం విశేషం… ఒక నాలుగైదు సన్నివేశాలైతే ఈ సినిమాలో హైలైట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. మరి వీటన్నింటిని అనిల్ రావిపూడి ఇప్పుడు చాలా చక్కగా డీల్ చేసినట్టుగా తెలుస్తోంది.
చిరంజీవి సైతం ఈ సినిమా అవుట్ పుట్ మీద చాలా హ్యాపీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక సంక్రాంతి విన్నర్ చిరంజీవి అవుతాడా? లేదా అనేది డిసైడ్ చేయాలంటే జనవరి 12వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. ముఖ్యంగా జనాలు ఆయన నుంచి వచ్చే కామెడీని ఏ రేంజ్ లో ఎంజాయ్ చేయగలుగుతారు అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…