
పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు ఉత్తరప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఆదివారమే జరగాల్సి ఉంది. అయితే, కొవిడ్ నేపథ్యంలో కౌంటింగ్ విధులకు హాజరు కావాల్సిన ఉపాధ్యాయులు వెనుకాడుతున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై నేడు కోర్టులో వాడీవేడీ వాదనలు జరిగాయి. ఓట్ల లెక్కింపు 2-3 వారాలు వాయిదా వేస్తే ఆకాశమేమైనా విరిగిపడుతుందా అంటూ న్యాయస్థానం యూపీ ఎన్నికల సంఘాన్ని ఘాటుగా ప్రశ్నించింది.