
భారత్ లో వచ్చిన కరోనా కేసులు ప్రపంచంలో మరెక్కడా రాలేదని కేఏపాల్ అన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ కేఏపాల్ చేపట్టిన దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో డేంజర్ పరిస్థితి లో ఉంది అని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పనికిమాలిన సలమాలు తీసుకుని తమ భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారని అన్నారు.