
ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలతో ఢిల్లీ నగరంలో పోస్టర్లు వేసిన వారిపై అక్కడి పోలీసులు సీరియస్ గా ఉన్నారు. గత రెండు రోజుల నుంచి నిందితులపై 13 ఎఫ్ ఐఆర్ లు నమోదు చేశారు. ఇప్పటి వరకు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో ని నాలుగు విభాగాలకు చెందిన పోలీసులు ఏకకాలంలో ఆపరేషన్ నిర్వహించి నిందితులను గుర్తించారు. నగరం మొత్తంలో మోదీ వ్యతిరేఖ నినాదాలతో ఉన్న 800 పైగా పోస్టర్లు బ్యానర్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో కరోనా మహమ్మారి కట్టడి చేయడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని కొందరు యువకులు ప్రధానిపై విమర్శలు చేశారు.