
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ సైనిక, పోలీసు అధికారులకు వివిధ పతకాలను ప్రకటించింది. వివిధ రాష్ట్రాలకు చెందిన 1,380 మంది పోలీసులకు పతకాలు అందించనుంది. ఇద్దరికి అత్యున్నతమైన రాష్ట్రపతి పోలీసు పతకాలు 628 మందికి గ్యాలంటరీ పతకాలు అందించనున్నారు. 88 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు, 662 మందికి విశిష్ట సేవా పతకాలు ఇవ్వనున్నారు. వీటిలో ఏపీకి చెందిన 11 మందికి, తెలంగాణకు చెందిన 14 మందికి గ్యాలంటరీ పోలీసు పతకాలు దక్కాయి.