
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణ శివారులో ఓ ఆర్టీసీ బస్సు పెట్రోల్ ట్యాంకర్ ను ఢీకొంది. వరంగల్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆర్మూర్ శివారుకు రాగానే పెట్రోల్ ట్యాంకర్ ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికుల్లో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నిజామాబాద్, ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.