Minister Jupally Krishna Rao: కాంగ్రెస్ పాలనలో సంతోషంగా ఉన్నారా అంటూ ప్రజలను అడిగిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. సంతోషంగా లేము అంటూ ప్రజలు బదులిచ్చారు. దీంతో మంత్రి షాక్ అయ్యారు. ప్రభుత్వ అధికారులపై మంత్రి జూపల్లి కృష్ణారావు సీరియస్ అయ్యాడు. రాష్ట్ర గీతం ఆలాపనలో సౌండ్ సిస్టం క్లారిటీ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలోని మున్ననూరు గ్రామం సమీపంలో ఉన్న గిరిజన భవన్లో ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాాల్గొన్నారు. రాష్ట్ర గీతం ఆలపించే సమయంలో సౌండ్ క్లారిటీ లేకపోవడంతో, అధికారులకు సెన్స్ లేదంటూ వారిని సస్పెండ్ చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులు కూర్చోవాల్సిన కుర్చీల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూర్చోవడంతో, స్థలం సరిపోక బయట నేలపైన కూర్చున్న గిరిజనులు, ఆదివాసులు, చెంచులు మీ సమావేశం కోసం పిలిచి మమ్మల్ని కింద కూర్చోబెట్టి అవమానిస్తారా అంటూ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్రేకింగ్ న్యూస్
మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఎదురు దెబ్బ
కాంగ్రెస్ పాలనలో సంతోషంగా ఉన్నారా అంటూ ప్రజలను అడిగిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. సంతోషంగా లేము అంటూ బదులిచ్చిన ప్రజలు https://t.co/Yop396x4yU pic.twitter.com/ltzJgrTtCf
— Telugu Scribe (@TeluguScribe) July 7, 2025