Chandrababu: చంద్రబాబును జనాలు నమ్మడం లేదట.. వాళ్లే ఒప్పుకున్నారు.. వైరల్ వీడియో

టిడిపి అనుకూల మీడియాగా పేరు పొందిన ఓ న్యూస్ ఛానల్ ఇటీవల డిబేట్ నిర్వహించింది. సూపర్ సిక్స్ పథకాలపై కొంతమంది విశ్లేషకులతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆ ఛానల్ న్యూస్ ప్రజెంటర్ పలు విషయాలపై ప్రశ్నలు సంధించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 27, 2024 3:38 pm

Chandrababu

Follow us on

Chandrababu: “సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు లాభం చేకూరుతుంది. అన్ని వర్గాల వారికి ప్రయోజనం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యచిత్రం సూపర్ సిక్స్ తో మారుతుంది.. అంతేకాదు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని” చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. బిజెపి నాయకులు కూడా సమయం దొరికినప్పుడల్లా గొప్పలు పోతున్నారు.. నిజంగా ఈ పథకాలను ప్రజలు నమ్మడం లేదా? ప్రజలనుంచి ఆశించినంత స్థాయిలో స్పందన లభించడం లేదా? అంటే ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం చెబుతున్నారు టిడిపి నాయకులు.

టిడిపి అనుకూల మీడియాగా పేరు పొందిన ఓ న్యూస్ ఛానల్ ఇటీవల డిబేట్ నిర్వహించింది. సూపర్ సిక్స్ పథకాలపై కొంతమంది విశ్లేషకులతో మాట్లాడింది. ఈ సందర్భంగా ఆ ఛానల్ న్యూస్ ప్రజెంటర్ పలు విషయాలపై ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు స్పందించారు. “సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు నమ్మకం లేదు. ప్రజల్లో ఆశించినంత స్థాయిలో స్పందన రావడం లేదు. దీన్ని చూసిన తర్వాత మాక్కూడా ఆశ్చర్యం వేస్తోంది. ఏం చేస్తే బాగుంటుందో అర్థం కావడం లేదని” టిడిపి నాయకులు వ్యాఖ్యానించారు.. అలా టిడిపి నాయకుడు వ్యాఖ్యానిస్తుండగా ఆ న్యూస్ ప్రజెంటర్ మధ్యలో కల్పించుకున్నారు. అయినప్పటికీ ఆ టిడిపి నాయకుడు అలానే మాట్లాడారు.

ఇక ఈ వీడియోను వైసీపీ అనుకూల సోషల్ మీడియా గ్రూపులో పోస్ట్ చేశారు. “చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలపై టిడిపి నాయకులకే నమ్మకం లేదు. ఆ మాట నేరుగా వారే చెప్తున్నారు. అలాంటప్పుడు వారిని నమ్మి ఎలా ఓట్లు వేస్తారు? సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని దివాలా తీయించారని జగన్ మీద విమర్శలు చేస్తున్న చంద్రబాబు.. సూపర్ సిక్స్ పథకాలు ఎలా అమలు చేస్తారని” వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. “ఇదీ వీరి ద్వంద్వనీతి అని.. టిడిపి అనుకూల మీడియా చేస్తున్న విష ప్రచారమని” వైసిపి నాయకులు ఎండగడుతున్నారు. వైసిపి అనుకూల సోషల్ మీడియా గ్రూపులో ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయడంతో.. టిడిపి అనుకూల నెటిజన్లు స్పందిస్తున్నారు. “రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతుంటే.. ఇలాంటి కటింగ్ వీడియోలతో వైసిపి నాయకులు శునకానందం పొందుతున్నారని” ఆరోపిస్తున్నారు. “మత్తు పదార్థాల వ్యవహారాన్ని పక్కకు తప్పించడానికే ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో వదులుతున్నారని” వారు విమర్శిస్తున్నారు. ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ కొద్దిరోజులుగా ప్రతిపక్ష, అధికార పక్ష నెటిజన్లు ఇలా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికల దగ్గరపడే నాటికి ఇలాంటి వ్యవహారాలు మరింత తీవ్రమవుతాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.