Pawan Kalyan health issues : సైనస్ ఆపరేషన్ కారణంగా గత కొంత కాలం నుండి విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ , నేడు తొలిసారి మీడియా ముందుకు వచ్చాడు. జనసేన పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న ఆయన , నేడు మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా బాగా వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఉద్యమి సభ్యత్వాలను అత్యధిక శాతం చేయించిన కార్యకర్తలను ఆయన ప్రత్యేకంగా అభినందించాడు. ఇదంతా పక్కన పెడితే , తన ఆరోగ్య పరిస్థితి పై పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానులను కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. ఇన్ని సమస్యలను పెట్టుకొని ఒక పక్క సినిమాలు , మరోపక్క రాజకీయాలు ఎలా మ్యానేజ్ చేస్తున్నావ్ అన్నా అని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం.
ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతానికి నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎన్నికల సమయం లో బాగా తిరగడం తో పాటు , నాకు కరోనా వచ్చినప్పుడు ఏర్పడిన లంగ్ ఇన్ఫెక్షన్ అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత దుమ్ము , ధూళి లో తిరగడం వల్ల , సైనస్ ప్రాంతాల్లో ఆ డస్ట్ బాగా గట్టి పడింది, అది కాలక్రమేణా వాచిపోయేలా చేసింది. ఆ కారణం చేత ఒక రోజు నా కళ్ళు కనిపించకుండా పోయింది. ఈ కారణాల చేత భీమవరం లో ఒక ప్రోగ్రాం ఉన్నప్పటికీ క్యాన్సిల్ చేసి , హైదరాబాద్ కి వెళ్లి , ఇవన్నీ సరిచేసుకొని రావడానికి ఒక నెల రోజుల సమయం పట్టింది. డాక్టర్లు నా రెండు భుజాల మధ్య కూడా టెర్ వచ్చేసిందని అన్నారు. ఎందుకు ఇలా వచ్చింది అని డాక్టర్లు అడగ్గా, క్యాంపైన్ కి వెళ్ళినప్పుడు అభిమానులు చేతులు పట్టుకొని లాగేస్తుంటారు , కన్దతెగిపోయేంత లాగేస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు అనేది స్పష్టమైంది , రాబోయే రోజుల్లో ఆయన సినిమాలను , రాజకీయాలను ఎలా బ్యాలన్స్ చేస్తాడో చూడాలి.
Peddha list ae undi kadayya mottam health issues pic.twitter.com/QMlyv8y8WR
— Kalyan Follower (@prakashraj_Jspk) May 15, 2026
