Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చాలామంది దర్శకులు సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఈ సంవత్సరం ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఫ్లాప్ అయింది. దాంతో రాజకీయ రంగంలో ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో కూడా తన అభిమానుల్లో నిరాశపరచకూడదనే ఉద్దేశ్యంతో అవకాశం దొరికిన ప్రతిసారి మంచి కథలతో సినిమాలు చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఆయన సురేందర్ రెడ్డి తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి ఆ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంలో సరైన క్లారిటి రావడం లేదు. ఇక డైరెక్టర్ సుజీత్ సైతం ఓజీ 2 ఉంటుందంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. దాంతో ఈ సినిమా షూటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక మరో దర్శకుడు పవన్ కళ్యాణ్ సీఎం గా చూపించడానికి ఒక అద్భుతమైన కథ కూడా రాసుకున్నారట. మరి ఆ డైరెక్టర్ కి పవన్ కళ్యాణ్ సినిమా చేసే అవకాశాన్ని ఇస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న శంకర్ కావడం విశేషం… ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన చాలావరకు ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇంతకుముందు ఆయన రామ్ చరణ్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేశాడు.
ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తానని అనుకున్నాడు కానీ ఆ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో శంకర్ భారీ విమర్శలనైతే మూటగట్టుకున్నాడు. దాంతో అతనితో సినిమాలు చేయడానికి ఎవరు ఆసక్తి చూపించడం లేదు. కానీ అతను పవన్ కళ్యాణ్ తో మాత్రం ఒక అదిరిపోయే కథతో సినిమా చేస్తానని చెబుతున్నాడు. ఒకప్పుడు ఒకే ఒక్కడు మూవీ తో సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు మరోసారి అలాంటి పాయింట్ తో వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.
ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో అలాంటి సినిమా చేస్తానని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. అలాగే పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే తన కథను కూడా వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
