మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అన్నయ్యని ఎంతో ప్రాణంగా ప్రేమించే పవన్ కళ్యాణ్ సుదీర్ఘ పోస్ట్ ద్వారా అన్నయ్య పై తనకున్న ప్రేమని తెలియజేస్తూ బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశాడు. చిరంజీవి నాకే కాదు ఎందురికో మార్గదర్శి, ఎందరికో స్ఫర్తి ప్రదాత, ఎందరికో ఆదర్శప్రాయుడు. చిరంజీవి గురించి ఎన్ని చెప్పినా కొన్ని మిగిలే ఉంటాయి. తమ్ముడిగా పుట్టడం నా అదృష్టమైతే, ఆయన సుగుణాలను చూస్తూ పెరగడం మరో అదృష్టం. అన్నయ్యను ఆరాధించే లక్షలాది మంది అభిమానులతో నేను ఒకడిని. ఆయన అసమ్యానుడిగా ఎదిగిన సామాన్యుడు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండడం ఆయనలోని అద్భుత లక్షణం. చిరంజీవికి ఆయురాగ్యాలతో కూడి దీర్ఘాయుష్షు ప్రసాధించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ పవన్ తెలిపారు.